కశ్మీరీలందరినీ అనుమానిస్తున్నారు: ఒమర్ అబ్దుల్లా

Published on Wed, 11/19/2025 - 16:56

జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు చేసిన పనికి ప్రాంతం మెుత్తాన్ని నిందిస్తున్నారని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా అసహానం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు ఎక్కడా ఉండే విధంగా లేదని ఎక్కడికెళ్లినా వారిని అనుమానంగా చూస్తున్నారని  అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడిలో జమ్మూకశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తులను ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు." ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కొంతమంది బాధ్యులు. కాని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంతంలోని వ్యక్తులంతా కారణం అన్నట్లున్నాయి. జమ్మూకశ్మీర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఢిల్లీలో తిరగడం నేరం అన్నట్లు చూస్తున్నారు. నేను ఆ ప్రాంతంలో తిరిగినా ఎవరూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేలా పరిస్థితులు కన్పిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

2019లో జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు అంతా ఆగిపోతుందని కేంద్రం చెప్పింది కానీ ఏమీ ఆగలేదు. ఒకవేళ ఢిల్లీలో బాంబుబ్లాస్ట్ జరిగి ఉండక పోతే తమ దగ్గర జరిగేదని జమ్మూ ఎంతో హింసను చూసిందని బాంబుల దాడులతో జమ్మూ ప్రజలు మరణించడం ఇంకా ఆగలేదని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులెవరూ పిల్లలను తమ ప్రాంతం వదిలి బయిటకు పంపించేలా లేరని ఒమర్ తెలిపారు.

కాగా ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఆయన తండ్రి ఫరుూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డాక్టర్లు ఈ మార్గం ఎందుకు ఎన్నుకున్నారు. దానికి కారణం ఏమిటి? దీనిపై సమగ్ర విచారణ జరపాలని  ఆయన అన్నారు.
 

 

 

 

 


 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)