Breaking News

Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం

Published on Tue, 11/12/2024 - 11:17

కాస్గంజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్‌లోని కస్బా మోహన్‌పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.

ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్‌లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.

ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)