Breaking News

కరూర్‌ తొక్కిసలాట కేసు: ఏదో తప్పు జరుగుతోంది..? సుప్రీంకోర్టు

Published on Fri, 12/12/2025 - 17:00

న్యూఢిల్లీ: తమినాడులోని కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిట్‌ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో ‘ఏదో తప్పు జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఈ కేసు విచారణ లిస్టింగ్‌ జాబితాకు సంబంధించి ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 

ఈరోజు(శుక్రవారం, డిసెంబర్‌ 12) ఈ కేసు విచారణ సందర్భంగా  మద్రాస్‌ హైకోర్టు  రిజిస్టార్‌ జనరల్‌ నివేదికను పరిశీలించిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను పార్టీగా చేరుస్తూ నోటీసు జారీ చేసింది అదే సమయంలో మద్రాస్‌ హైకోర్టులో అనుసరిస్తున్న నియమాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై మద్రాస్‌ హైకోర్టు.. సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ విజయ్‌ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. టీవీకే విజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా మద్రాస్‌ హైకోర్టు సిట్‌ విచారణకు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంపై గతంలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈసారి  ఆ హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోంది’ అంటూ అనుమానం వ్యక్తం చేసింది.  ఈ మేరకు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్టోయిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యంతో పాట అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. 

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది  సీబీఐ విచారణ కోరుతూ విజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన మద్రాస్‌ హైకోర్టు.. సిట్‌ దర్యాప్తునకు మాత్రం ఆదేశాలివ్వడంతో  కేసుల విచారణ లిస్టింగ్‌  సరిగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)