Breaking News

డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య

Published on Sat, 02/08/2025 - 17:02

వివాహేతర సంబంధాలు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. వైవాహికేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఆలుమగల నైతిక​ విలువల పతనం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తలను మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్త కాళ్లు విరగొట్టిచ్చింది. కిరాయి మనుషులకు డబ్బులిచ్చి మరీ ఆమె ఘనకార్యానికి పాల్పడడం గమనార్హం. బండారం బయట పడడంతో ఆమెతో పాటు ముగ్గురు నిందితులు కటకటాల పాలయ్యారు.

కలబుర్గి (kalaburagi)లోని అత్తార్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో చోటుచేసుచేసుకున్న ఈ ఘటన వివరాలను మీడియాకు పోలీసులు వివరించారు. వెంకటేష్‌, ఉమాదేవి భార్యాభర్తలు. వెంకటేష్‌ మరో మహిళతో వివావహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉమాదేవికి తెలియడంతో చాలాసార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నిసార్లు చెప్పినా వెంకటేష్‌ తన వైఖరి మార్చుకోకపోవడంతో ఉమాదేవి విసిగిపోయింది. ఏదోటి చేసి భర్తను తన దారికి తెచ్చుకోవాలని అనుకుంది. కాళ్లు విరగ్గొడితే ఇంటి పట్టునే ఉండి తన దారికి వస్తాయని అనుకుంది.

తన ప్లాన్‌ అమలు చేయడానికి  ఆరిఫ్‌, మనోహర్‌, సునీల్‌ అనే వ్యక్తులను సంప్రదించింది. తన భర్త కాళ్లు విరగ్గొడితే 5 లక్షల రూపాయలు ఇస్తానని వారితో చెప్పింది. ఆఫర్‌ నచ్చడంతో రంగంలోకి దిగిన ముగ్గురు పని పూర్తి చేశారు. దోపిడీ పథకం వేసి వెంకటేష్‌ రెండు కాళ్లతో పాటు చేయి విరగొట్టారు.. అయితే బాధితుడి కుమారుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బ్రహ్మపురి పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో ఉమాదేవితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్యే తన కాళ్లు విరగ్గొట్టించిందని తెలియడంతో వెంకటేష్‌ ఆవేదనకు గురయ్యాడు. కాగా, వెంకటేష్‌, ఉమాదేవి ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.

ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష 
మైసూరు: భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడు, ఆమె సోదరుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మైసూరు (Mysore) జిల్లా నంజనగూడు తాలూకా బిళిగెరె గ్రామంలో కుమార, జ్యోతి దంపతులు నివాసం ఉండేవారు. జ్యోతికి చిక్కాటి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

కుమారకు ఈ విషయం తెలిసి భార్యను మందలించాడు. నడత మార్చుకోవాలని పలుమార్లు సూచించాడు. అయినా ఆమె పెడచెవిన పెట్టింది. అంతేగాకుండా ప్రియుడు, తన సోదరుడితో కలిసి కుమార్‌ను దుర్భాషలాడి  బెదిరించింది. దీంతో మనో వేదనకు గురైన కుమార 2018 జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు.

చ‌ద‌వండి: ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు

బిళిగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జ్యోతి, ఆమె ప్రియుడు ప్రసన్నకుమార్, ఆమె సోదరుడు మంజునాథ్‌పై కేసు నమోదు చేశారు. అదనపు జిల్లా కోర్టులో ఈకేసు విచారణకు వచ్చింది. దోషుల నేరం నిరూపితం కావడంతో ముగ్గురికీ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.భాగ్య తీర్పు వెలువరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)