Breaking News

మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం

Published on Fri, 06/16/2023 - 12:33

కర్ణాటక: కర్ణాటకాలో కొత్తగా కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. జులైలో ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

'కేబినెట్‌లో మతమార్పిడి బిల్లుపై చర్చ జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. జులై 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టనున్నాము'అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. 

మోసపూరిత మార్గాల ద్వారా మత మార్పిడీకి పాల్పడకుండా 'మతమార్పిడి నిరోధక చట్టాన్ని' బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రలోభానికి గురిచేసి మత మార్పిడీకి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాలను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. 

ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)