Breaking News

నేటి నుంచి ఆర్టీసీ బంద్‌!

Published on Tue, 08/05/2025 - 11:04

కర్ణాటక: ప్రజా రవాణాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కేఎస్‌ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులు మంగళవారం బంద్‌ అయ్యే అవకాశముంది. పలు డిమాండ్లపై సర్కారుతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలించలేదు.  ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు 38 నెలల వేతన బకాయిల చెల్లింపుతో పాటు అనేక డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. రవాణాశాఖ ఒక్కోట నాయకులు సీఎం సిద్దరామయ్య సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం నుంచి బస్సులు రోడ్ల పైకి వెళ్లవు. ఉదయం 6 నుంచి సమ్మె చేస్తామని రవాణా మండలి కార్మిక సంఘాల జాయింట్‌ క్రియా సమితి అధ్యక్షుడు అనంత సుబ్బారావ్‌ తెలిపారు.    

14 నెలల బకాయిలిస్తాం: మంత్రి   
ఉద్యోగులకు 14 నెలల వేతన బకాయిలను ఇవ్వడానికి సీఎం సమ్మతించారని రవాణాశాఖమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. విధానసౌధ వద్ద విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడుతూ బకాయిల కింద రూ.718 కోట్లు చెల్లిస్తామని అన్నారు.   

వాయిదాకు హైకోర్టు సూచన  
రవాణా సమ్మెను ఒకరోజు వాయిదా వేయాలని హైకోర్టు న్యాయమూర్తులు కేఎస్‌.ముదగల్, ఎంజీఎస్‌.కమల్‌ ధర్మాసనం ఉద్యోగులకు సూచించింది. సమ్మె వల్ల జనజీవనం అస్తవ్యస్తమౌతుందని బెంగళూరువాసి జే.సునీల్‌ తదితరులు పిల్‌ వేశారు. విచారించిన జడ్జిలు ఒకరోజు వాయిదా వేయాలని సూచించారు.    

రవాణా ఉద్యోగులు సెలవులు రద్దు   
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవాణా శాఖ ఉద్యోగులు సెలవుల రద్దుచేసింది. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా కట్టడి చేసింది. ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, వీలైతే వారం సెలవు కూడా రద్దుచేయాలని అధికారులను ఆదేశించింది. గైర్హాజరయ్యే  ఉద్యోగులు వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది.     

సమ్మె విరమించండి: సిద్దరామయ్య     
ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో  సీఎం సిద్దరామయ్య విధానసౌధలో  సుదీర్ఘంగా చర్చించారు. డిమాండ్లను తీర్చడానికి గడువు ఇవ్వాలని, సమ్మె యోచనను విరమించాలని కోరారు. కానీ ఉద్యోగులు మాత్రం డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబట్టారు. సమ్మె వల్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగే అవకాశముంది.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)