Breaking News

వాడితో తిరగడం మానుకో బిడ్డా.. ఇంతలోనే..

Published on Mon, 06/16/2025 - 08:20

సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్‌ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్‌ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్‌ 16న గదగ్‌ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్‌ స్టేషన్‌లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్‌ హిరేమఠ్‌పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.

పెళ్లి చేసుకోమనడంతో..
ఇద్దరూ బైక్‌లో వెళ్తున్నట్లు గదగ్‌లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్‌ యస్‌ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు