శబరిమల వెళ్తుండగా.. కర్ణాటక భక్తుల వాహనానికి ప్రమాదం

Published on Mon, 11/17/2025 - 14:49

పథనంతిట్ట: కర్ణాటక నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన కోటాయం సమీపంలో చోటుచేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ముండక్కయం సమీపంలోని అమరావతి వద్దకు రాగానే.. డ్రైవర్ కునికిపాటు కారణంగా రోడ్డుకు ఎడమపక్కనున్న గోడను బలంగా ఢీకొంది. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్, మరో భక్తుడు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి, వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 

అయితే.. క్షతగాత్రులను తరలిస్తున్న వాహనం.. కరినిలం వద్ద మరో కారును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాగా.. శబరి యాత్రికుల వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు వివరించారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని, లోయలు ఉన్నచోట సేఫ్టీగా బారీకేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా.. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఆదివారం సాయంత్రం తెరుచుకోగా.. భక్తుల రద్దీతో నీలక్కల్, పంపాబేస్, శబరిమల సన్నిధానం ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం ఉదయం పులిమేడు, పెద్దపాదం మార్గాలను అధికారులు ప్రారంభించారు.

Videos

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

Photos

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)