Breaking News

కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా 

Published on Fri, 02/14/2025 - 06:27

మైసూరు: కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు. ‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైనా దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ్‌కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్‌రాజ్‌గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్‌ పిలుపునిచ్చారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)