Breaking News

భార్య భోజనం వడ్డించలేదని.. తల నరికి, చర్మం ఒలిచి..!

Published on Fri, 05/31/2024 - 05:14

తుంకూర్‌: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 

కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్‌ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు.

 ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. 

ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్‌ ఎస్‌పీ అశోక్‌ వెంకట్‌ గురువారం తెలిపారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)