Breaking News

లంచం తీసుకుంటూ.. ఎస్‌ఐ, పోలీసుల పరారీ

Published on Fri, 09/05/2025 - 09:09

దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది. పోక్సో కేసులో అనుకూలంగా చార్జ్‌షిట్‌ తయారు చేస్తామని, ఇందుకు రూ.70 వేలు ఇవ్వాలని దేవనహళ్లి పోలీస్‌స్టేషన్‌ మహిళా ఎస్సై జగదేవి, ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండు చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో బాధితుడు లోకాయుక్తను  ఆశ్రయించాడు. 

అతని నుంచి రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ అమరేశ్‌ పట్టుబడగా మరో కానిస్టేబుల్‌ మంజునాథ్, ఎస్సై జగదేవి ఇద్దరూ కాలికి బుద్ధిచెప్పారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఠాణాలో సోదాలు చేసి పలు రికార్డులను సీజ్‌ చేశారు. పరారైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది.    \

లైన్‌మ్యాన్‌కు షాక్‌    
మీటర్‌ మార్చడానికి రూ.10 వేలు లంచం డిమాండు చేసిన బెస్కాం లైన్‌మ్యాన్‌ లోకాయుక్తకు చిక్కిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా బేవూరు బెస్కాం సబ్‌ డివిజన్‌ లైన్‌మ్యాన్‌ రమేశ్‌ను హనుమంతయ్య అనే వ్యక్తి కలిసి ఇంటి పాత మీటర్‌ మార్చి కొత్త మీటర్‌ అమర్చాలని కోరాడు. ఇందుకు రూ.10వేలు లంచం అడిగాడు. ఆ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త సిబ్బంది దాడి చేసి రమేశ్‌ని పట్టుకున్నారు.    

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)