Breaking News

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహం

Published on Thu, 06/05/2025 - 15:51

బెంగళూరు: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశించిన ధర్మాసనం.. ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

ఇంతటి భారీస్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదంటూ సీజే ప్రశ్నించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని.. కానీ ఊహించని విధంగా ఘటన జరిగిందని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. స్టేడియంలో 21 గేట్లు తెరిచారా అంటూ కోర్టు ప్రశ్నించింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు.

భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామన్న ఏజీ.. విచారణకు ఆదేశించామని.. 15 రోజుల్లోనే ఘటనపై కోర్టుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. క్రికెటర్లకు సన్మానం చేయాలని నిర్ణయించింది ఎవరు?. సన్మానం​ చేయాలనుకుంది ఆర్సీబీనా? కర్ణాటక అసోసియేషనా? లేక ప్రభుత్వమా? అంటూ అడ్వకేట్‌ జనరల్‌కు న్యాయవాది సూటి ప్రశ్నలు వేశారు. జరిగిన ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారన్నారు. ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

 

 


 

 

 

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)