Breaking News

డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి

Published on Fri, 10/20/2023 - 06:01

బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్‌ కె.నటరాజన్‌ స్పష్టం చేశారు.

2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే అవకాశముందని తెలిసింది.  

రాజకీయ దురుద్దేశంతోనే: డీకే  
రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్‌ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్‌ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్‌ విసిరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)