Breaking News

Karnataka: ఇద్దరు ఆఫీసర్లకూ ఝలక్‌

Published on Tue, 02/21/2023 - 16:46

బెంగళూరు: కర్ణాటక మహిళా అధికారుల వివాదం ప్రభుత్వ జోక్యంతో సరికొత్త మలుపు తిరిగింది. ఇద్దరు మహిళా అధికారిణిలకు అక్కడి ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండానే.. ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు  మంగళవారం ప్రకటించింది. తక్షణమే ఈ బదిలీలు అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.

బదిలీకి ముందుదాకా.. రూప కర్ణాటక హస్త కళల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఇక సింధూరి ఏమో ధర్మాధయ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరూ బహిరంగ విమర్శలు చేసుకోవడం తెలిసిందే. మరోవైపు రూప భర్త మునీష్‌ మౌద్గిల్‌ ఐఏఎస్‌ అధికారి కాగా, ఆయన్ని పబ్లిసిటీ విభాగంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. వీళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ, చర్యల తర్వాత పోస్టింగ్‌ విషయంలో ఒక స్పష్టత రావొచ్చని సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.  

ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గిల్‌, ఐఏఎస్‌  అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత విమర్శలతో ప్రజలనే కాదు.. ప్రభుత్వాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆదివారం ఫేస్‌బుక్‌లో.. రూపా, రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను ఉంచడంతో వ్యవహారం మొదలైంది. తన వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడ్చిందంటూ రూపపై రోహిణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మరోవైపు రూప, రోహిణిపై అవినీతి విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి వ్యవహారంపై సీఎం బసవరాజ్‌ బొమ్మై కూడా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్‌ ద్వారా నివేదిక తెప్పించుకున్న ఆయన.. ఇద్దరిపై చర్యలు తప్పవనే సంకేతాలను నిన్ననే(సోమవారం) అందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)