Breaking News

హైకమాండ్‌ను ఇబ్బంది పెట్టను

Published on Thu, 12/25/2025 - 04:28

శివాజీనగర/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యా­ఖ్య­లు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే బుధవారం కర్ణాటక భవన్‌లో మీడియాతో మాట్లా డుతూ, ‘సీఎం సిద్ధ­­రామయ్య హైకమాండ్‌ కోర్టులో బంతి వేశారు. హైకమాండ్‌కు సమస్య కలిగించబోను. రాహుల్‌గాంధీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు. 

ఢిల్లీలో హైకమాండ్‌ నేతలు ఎవరి­తోనూ తాను సమావేశం కాలేదని కూడా స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎలాంటి ఊహాగానాలు లేవని, అల్పాహార విందులు మా మూలు విషయాలేనని కూడా అన్నారు. మైసూరులో సీఎం సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన వర్గీయు లు బీసీ, దళిత (అహింద) సమావేశం జరపబో తున్నారన్న వార్తలను ప్రస్తావించగా, అదంత మంచిది కాదని సమాధానం చెప్పారు. 

ముఖ్యమంత్రి కుర్చీ మార్పి డి వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య పట్టువీడకపోవడం.. హైకమాండ్‌ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. స్థానికంగానే ఈ సమస్యను పరిష్కరించు­కుంటారంటూ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రకటన వంటి పరిణామాల నేపథ్యంలో శివకుమార్‌ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంత రించుకుంది. దీని­తో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 

సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రం: మంత్రి జమీర్‌
కాగా, సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రంగా ఉందని కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ బుధవారం విలేకరులతో అన్నారు. 2028 వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు.  ‘హైకమాండ్‌ తప్ప వేరే ఎవరి వల్లా సీఎం సీటు నుంచి సిద్ధరామయ్యను తొలగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)