Breaking News

చరిత్ర సృష్టించనున్న సిద్ధరామయ్య..!

Published on Mon, 01/05/2026 - 18:46

సాక్షి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. జనవరి ఆరు రేపటితో అత్యధిక కాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రికార్డును ఆయన సమం చేయనున్నారు. ఆ తరువాత రోజుతో అధిక కాలం పనిచేసిన వ్యక్తిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి అనుచరులు, శ్రేయోభిలాషులు సంబురాలు చేసుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎంట్రీతో ప్రస్తుతానికి ఆ విషయం సద్దుమణిగింది. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.  రేపటితో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కాలాన్ని సమం చేసిన ఆయన... ఎల్లుండితో ఆ రికార్డు బద్దలు కొట్టనున్నారు.

ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డి. దేవరాజ్ ఉర్స్ ఇంతకాలం వరకూ అక్కడ అధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన 1972-77, 1978-80 కాలంలో సీఎంగా కర్ణాటకకు సేవలంధించారు. మెుత్తంగా ఆయన 7సంవత్సరాల 239రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రేపటితో సిద్ధరామయ్య ఆరికార్డును సమం చేస్తారు. 2013-18తో పాటు 2023నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో జనవరి ఏడుతో అత్యధిక కాలం కర్ణాటకకు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.

అయితే ఈ రికార్డుపై సిద్ధరామయ్య స్పందించారు...  "ప్రజల ప్రేమ ఆశీర్వాదం వల్లే ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలంధించా, రాజకీయాల్లోకి ప్రవేశించేటప్పుడు మంత్రి, ముఖ్యమంత్రిగా సేవలంధిస్తానని నేను అనుకోలేదు. కేవలం ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాను". అని సిద్ధరామయ్య అన్నారు. ఇప్పటివరకూ తాను మెుత్తం 13 ఎన్నికల్లో పోటీచేస్తే ఎనిమిది ఎన్నికల్లో గెలిచానని తెలిపారు.

తొలిసారి తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలే తనకు నిధులు సమకూర్చి గెలిపించారన్నారు. సచిన్ రికార్డును విరాట్‌ కోహ్లీ బద్దలుగొట్టినట్లుగా తాను వాటిని అధిగమించానని సిద్ధరామయ్య సరదాగా అన్నారు.

Videos

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)