Breaking News

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు

Published on Fri, 10/17/2025 - 04:45

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)పై పరోక్షంగా ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సర్క్యులర్‌ను జారీచేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి ప్రైవేట్‌ సంస్థల కార్యక లాపాలపై కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, సాంకేతికత శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే మీడియాకు వెల్లడించారు.

 ‘‘మేం ఎలాంటి సంస్థ(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకలాపాలను నియంత్రించబోము. కానీ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయా అభ్యర్థనల తర్వాత ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 

ఇకపై స్థానిక పాలనా యంత్రాంగానికి ఊరకే ముందస్తు సమాచారం ఇచ్చేసి రహదారులపై కర్రలు ఊపుతూ కవాతులు, మార్చ్‌లు, పథ సంచలన వంటి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదు. బహిరంగ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో కొత్త నియమ నిబంధనలు అమలు చేయబోతున్నాం’’ అని ప్రియాంక్‌ చెప్పారు.

పాత నిబంధనలే కొత్తగా..
‘‘వాస్తవానికి గతంలో హోం శాఖ, న్యాయ విభాగం, విద్యా శాఖ జారీచేసిన ఉత్తర్వులనే గుదిగుచ్చి ఏకీకృత నిబంధనావళిగా మారుస్తున్నాం. వచ్చే రెండు, మూడ్రోజుల్లో ఈ కొత్త నియమావళి అమల్లోకి రానుంది. ఇది రాజ్యాంగంలోని చట్టాల మేరకే అమలవుతుంది’’ అని మంత్రి ప్రియాంగ్‌ స్పష్టంచేశారు. 

కర్ణాటక వ్యాప్తంగా ఆరెస్సెస్‌ కార్యకలా పాలను నిషేధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్‌ లేఖ రాసిన రెండు వారాలకే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తుండటం గమనార్హం. 

‘‘ బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న అంశం కేబినెట్‌ భేటీలో చర్చకొచ్చింది. విద్యాసంస్థలు సహా ప్రభుత్వ స్థలాల వినియోగంపై నియంత్రణ కోసం హోంశాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల సద్వినియోగం, దుర్విని యోగంపై సంబంధిత విభాగాలకు ఆదేశాలు వెళ్లనున్నాయి’’ అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్‌ చెప్పారు. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)