Breaking News

Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్‌ స్థానం ఆయనకే!

Published on Mon, 04/17/2023 - 20:53

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది.

చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్‌థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్‌ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్‌ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్‌ సెక్రటరీ మహేష్‌ తెంగినాకైకి చోటు కల్పించింది.

కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్‌ శెట్టర్‌.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్‌ ఎమ్మెల్యే అరవింద్‌ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్‌ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్‌ ఇచ్చింది.

కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు