Breaking News

13 రోజులు, 1900 కిలోమీటర్లు

Published on Mon, 07/20/2026 - 21:45

దేశవ్యాప్తంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌  నిర్వహణలో భాగంగా, రక్షణ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ జెండా ఊపి ప్రారంభించగా, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం దగ్గర మొదలైన ‘శౌర్య విజయ్‌ యాత్ర’ ఈ నెల 26 ముగియనుంది.  క్లాసిక్‌ లెజెండ్స్‌ ఆధ్వర్యంలో రైడర్లు జావా  యెజ్డీ మోటార్‌సైకిళ్లపై 13 రోజుల పాటు కొనసాగే ఈ సాహస యాత్రను  ‘వన్‌ రైడ్, వన్‌ నేషన్, వన్‌ సెల్యూట్‌’ అనే నినాదంతో చేపట్టారు. ఈ 1,900 కిలోమీటర్ల యాత్రలో, విధుల్లో ఉన్న పదవీ విరమణ పొందిన రక్షణ దళాల సిబ్బందితో పాటు,  ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులు సహా మొత్తం 28 మంది రైడర్లు పాల్గొంటున్నారు. 

వీరు లడఖ్‌లోని ద్రాస్‌లో ఉన్న కార్గిల్‌ యుద్ధ స్మారక చిహ్నం దగ్గర ప్రయాణం ముగిస్తారు.   కార్గిల్‌ యుద్ధంలో  అసమాన ధైర్యసాహసాలు, అచంచల సంకల్పం, పరమ త్యాగం చేసిన భారత వీర జవాన్లకు ఘన నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర చండీమందిర్, రెజాంగ్‌ లా,  లేహ్‌ యుద్ధ స్మారకాలను సందర్శిస్తూ ప్రయాణించి, ఈనెల 26న కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద ముగుస్తుంది. 

భారత దేశం చూసిన వివిధ తరాల యుద్ధ వీరుల వారసత్వ సమ్మేళనానికి ప్రతీకగా, ఈ యాత్రలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి తీసుకువచ్చిన పవిత్ర మట్టిని కార్గిల్‌కు తీసుకువెళుతున్నారు. ఈ సందర్భంగా క్లాసిక్‌ లెజెండ్స్‌ సహ–వ్యవస్థాపకుడు అనుపమ్‌ థరేజా మాట్లాడుతూ భారత వీర సైనికుల స్ఫూర్తిదాయక గాథలు, దేశానికి వారు చేసిన సేవలను  సమాజానికి స్మరణీయంగా మార్చాలనే ఉద్దేశంతో జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్‌ ఈ యాత్రకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)