Breaking News

ఈసీ గోయెల్‌ రాజీనామా.. కపిల్‌ సిబల్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 03/10/2024 - 12:15

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌(ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని సిబల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిబల్‌ మీడియాతో మాట్లాడారు.

‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల కమిషన్‌ విధి. అయితే గత పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైంది’అని సిబల్‌ విమర్శించారు. దీనికి తోడు సిబల్‌ ఆదివారం ఎక్స్‌(ట్విటర్‌)లోనూ గోయెల్‌ రాజీనామాపై ఒక పోస్టు పెట్టారు. ‘దారి క్లియరైంది. కమిషన్‌ మొత్తం ఎస్‌ చెప్పే వ్యక్తులతో నింపండి.

అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది’ అని గోయెల్‌ రాజీనామాను ఉద్దేశించి సిబల్‌ సెటైర్లు వేశారు. కాగా, లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ కొద్దిరోజుల్లో వెలువడుతుందనగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామా  సంచలనం రేపింది. ఈయన రాజీనామా దేశంలో రాజకీయ దుమారానికి దారి తీసింది. 

ఇదీ చదవండి.. ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)