Breaking News

యూపీలో మరో రైలు ప్రమాదం

Published on Sun, 08/25/2024 - 08:50

ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్‌-కాన్పూర్ రైల్వే లైన్‌లో కాస్గంజ్‌ నుంచి ఫరూఖాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ప్యాసింజర్‌ రైలు బలంగా ఢీకొంది. దానిని రైలు ఇంజిన్‌ 550 మీటర్ల దూరంవరకూ ఈడ్చుకెళ్లడంతో ఇంజిన్ ముందు భాగంలో దుంగ ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు.

ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగలేదు. సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాన్పూర్ డివిజన్‌లో వారం వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. గత శుక్రవారం నాడు పంకిలో బండరాయిని ఢీకొనడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాజాగా కాస్గంజ్ నుండి ఫరూఖాబాద్ వెళ్లే ప్రత్యేక రైలు (05389) భటాసా స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఉంచిన భారీ కర్ర దుంగను ఢీకొంది. నాలుగున్నర అడుగుల పొడవున్న దుంగ బరువు 35 కిలోలు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ జహీర్ అహ్మద్, ఆర్పీఎఫ్ ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అంకుష్ కుమార్, ఇంజన్ విభాగానికి చెందిన రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఆ కర్ర దుంగను తొలగించి 33 నిమిషాల తర్వాత రైలును పంపించారు. ఘటనా స్థలానికి 50 అడుగుల దూరంలో ఒక పొలంలో మృతదేహం పడివుండటాన్ని వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)