Breaking News

Kannauj: రైల్వే స్టేషన్‌లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!

Published on Sat, 01/11/2025 - 16:27

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 

శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 12 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్‌(DM) శుభ్రాంత్‌ కుమార్‌ శుక్ల్‌ తెలిపారు.  

కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 35 మంది కూలీలు అక్కడ ఉన్నట్లు సమాచారం.

ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.

కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)