Breaking News

ముందుంది ఎన్నికల సమరం.. బీజేపీలోకి కేజీఎఫ్‌ నటుడు!

Published on Wed, 02/22/2023 - 11:57

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యేగా, పరిషత్ సభ్యుడిగా పనిచేసిన అనంత్ నాగ్, జేహెచ్‌ పటేల్‌ ప్రభుత్వంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ తరపు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అనంత్‌ నాగ్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్‌ కేజీఎఫ్‌ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరేందుకు బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్‌లు అనంత్‌నాగ్‌ను ఒప్పించినట్లు సమాచారం. మరో వైపు రానున్న కర్టాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర నేతలు కర్ణాటకలో భారీగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే  మంగళూరు, ఉడిపి, చక్కమగళూరు హాసన్ కార్యక్రమాల్లో నడ్డా పాల్గొన్నారు. ప్రధాని కూడా త్వరలో షిమోగాలో పర్యటించి మహా సమ్మేళనంలో ప్రసంగించనున్నారు. కర్టాటకలో మరో సారి గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి  అతిగా ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నారు.. ఇదేమైనా ఇంగ్లాండా? సీఎం నితీష్‌ ఆగ్రహం

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)