టీనేజ్‌లో గాంధీజీని తీవ్రంగా విమర్శించేవాడిని: కమల్‌ హాసన్‌

Published on Mon, 01/02/2023 - 14:30

సినీ నటుడు రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమల్‌ మహాత్మా గాంధీ గురించి చాలా ఆసక్తికర విషయాలు రాహుల్‌కి చెప్పారు. తాను టీనేజ్‌లో ఉండగా జాతిపిత మహాత్మగాంధీని తీవ్రంగా విమర్శించేవాడినని, పైగా ఆ వాతావరణం కూడా అలానే ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కానీ తన నాన్న మాత్రం కాంగ్రెస్‌ వ్యక్తేనని అ‍న్నారు.

సంత్సరాలు గడిచేకొద్ది తాను మహాత్మా గాంధీకి అభిమానిగా మారానని చెప్పారు. అందుకే హేరామ్‌ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. తప్పుచేస్తే క్షమించండి అని చెప్పడం తన పద్ధతి అని కూడా చెప్పారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న వారం రోజుల తర్వాత ఇరువురు కలిసి ఇలా సమావేశమయ్యారు. రాహుల్‌ గాంధీ తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలో కమల్‌హాసన్‌కు ప్రియాంక గాంధీ కుమారుడు క్లిక్‌ చేసిన పులి నీరు తాగుతున్నపెద్ధ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు.

 ఇది మీ జీవితం పట్ల దృక్పథం, వైఖరిని చెబుతోంది, పైగా మీరు గొప్ప భారతీయుడు, గొప్ప ఛాంపియన్‌ అనే వాస్తవాన్ని మాకు తెలియజేస్తుందంటూ రాహుల్‌ ఈ చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ.. కమల్‌ హాసన్‌తో అన్నారు. అలాగే రాహుల్‌ ద్వేషం అనేది అంధత్వం, అపార్థం లాంటిదని కామెంట్‌ చేయగా, అందుకు ప్రతిగా కమల్‌ ద్వేషానికి ఉన్న మరో చెత్త రూపం 'హత్య' అని చెప్పారు.

(చదవండి: ఢిల్లీ మహిళను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన..వెలుగులోకి విస్తుపోయే నిజాలు)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)