జ్యోతి కుటుంబానికి ఆర్థిక సాయం.. సోదరుడికి ఉద్యోగం

Published on Wed, 07/29/2026 - 14:02

యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్న పీహెచ్‌డీ స్కాలర్‌ జ్యోతి కుటుంబానికి అధికారులు అండగా నిలిచారు. విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చి ఆమె కుటుంబానికి రూ.16 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పంజాబ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. అంతేకాకుండా.. ఆమె కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సోదరుడికి యూనివర్సిటీలోనే ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించింది.

హరియాణాలోని రేవారీకి చెందిన 28 ఏళ్ల జ్యోతి.. పంజాబ్‌ యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని హాస్టల్‌ నుంచి తన విభాగానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వర్షాల కారణంగా క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జ్యోతి ప్రధాన మార్గానికి బదులుగా నీరు నిలిచిన ప్రాంతం పక్కనున్న దారిలో వెళ్లింది. ఆ సమయంలో..  సమీపంలోని విద్యుత్‌ జంక్షన్‌ బాక్స్‌ కరెంట్‌ వైర్‌ తెగిపడింది. విద్యుత్‌ షాక్‌తో కుప్పకూలిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

విద్యార్థుల నిరసనలు
జ్యోతి మృతిపై పంజాబ్‌ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో విద్యుత్‌ భద్రతా లోపాలపై ప్రశ్నిస్తూ వందలాది మంది విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. క్యాంపస్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జ్యోతి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత నిర్ణయం
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు జ్యోతి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం రూ.16 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే జ్యోతి సోదరుడికి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి సోదరుడు 10+2తో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్‌) విద్యార్హత కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతడిని యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా నియమించనున్నట్లు వెల్లడించారు.

బాధ్యులపై దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాంపస్‌లో విద్యుత్‌ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. చండీగఢ్‌ ఎంపీ మనీష్‌ తివారీ కూడా జ్యోతి మృతిపై స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొంటూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)