Breaking News

‘నాకే షాకింగ్‌గా ఉంది’.. కాలిన నోట్ల కట్టలపై జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ

Published on Sun, 03/23/2025 - 12:44

ఢిల్లీ: అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వస్తున్న ఆరోపణలపై  ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma)తో పాటు అతని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జరగడం షాకింగ్‌గా ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఢిల్లీ హైకోర్టు సీజేకు లేఖ
ఆ డబ్బులు తన ఇంట్లో దొరకలేదని, ఆ గది తన ప్రధాన నివాసానికి ఏమాత్రం సంబంధలేదని తెలిపారు. ఇంట్లో సహాయకులు మాత్రమే ఆ గదిని వినియోగించుకునే వారని చెప్పారు. ఈ మేరకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు (devendra kumar upadhyaya) జస్టిస్ వర్మ ఒక లేఖ రాశారు.  

 

ఖండిస్తున్నాను
ఆ లేఖలో  ‘నోట్ల కట్టలు దొరికాయని ఆరోపణలు వస్తున్న  స్టోర్‌ రూం నిరుపయోగంగా ఉండేది. పాత ఫర్నిచర్, సీసాలు, వంట సామగ్రి, పరుపులు, పాత స్పీకర్లు, తోట పనికి అవసరమైన సామగ్రి, అలాగే సీపీడబ్ల్యుడి (CPWD) మెటీరియల్ వంటివి అక్కడ నిల్వ ఉంచేవారు. ఇంట్లో సహాయకులకు అందుబాటులో ఉండే గది. నా ఇంటికి దీనికి సంబంధం లేదు. కాని దీనిని నా ఇంటి భాగంగా చూపించడాన్ని నేను ఖండిస్తున్నాను.

బ్యాంక్‌ ట్రాన్సాక్షన్‌ను పరిశీలించండి
మార్చి 14న నేను, నా సతీమణి  మధ్యప్రదేశ్‌లో ఉన్నాం. ప్రమాదం జరిగే సమయంలో తన ఇంట్లో తమ కుమార్తె, తల్లి మాత్రమే ఉన్నారు. మార్చి 15న తాము భోపాల్ నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో  నా కుమార్తె, నా ప్రైవేట్ సెక్రటరీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి కాల్ రికార్డులను పరిశీలించొచ్చు. అయితే, అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చాక అక్కడ నగదు కనిపించలేదు.  నా కుటుంబ సభ్యులెవరూ స్టోర్‌ రూంలో నగదు ఉంచలేదు. మా డబ్బు లావాదేవీలు అన్ని బ్యాంకింగ్ చానెల్స్ ద్వారానే జరుగుతాయి. యూపీఐ, కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తాం

నాకే షాకింగ్‌గా ఉంది
ఈ సందర్భంగా నాకు షాకింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే?  నా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వెలుగులోకి వచ్చిన వీడియోలు,ఫొటోలు.. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే కనిపించలేదు. నా మీద కుట్ర జరుగుతోందని నాకు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటన నా వ్యక్తిత్వాన్ని, న్యాయవ్యవస్థలో నా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో కూడా సోషల్ మీడియాలో నాపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా వాటికి కొనసాగింపు అనేది నా అనుమానం.

నా ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర 
నా న్యాయ జీవితంలో, నా న్యాయ నిర్ణయాల్లో ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నా నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలని కోరుతున్నాను’ అని సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు.  

సుప్రీంకోర్టు కమిటీ
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్ హర్యాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు.

కాగా, ఈ కేసు పరిణామాలు తేలే వరకు జస్టిస్ వర్మకు కొత్త న్యాయపరమైన పనులను కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)