Breaking News

సుప్రీం జడ్జిగా బాగ్చీ ప్రమాణం

Published on Tue, 03/18/2025 - 06:19

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్‌ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్‌ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ  ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు.

 అక్టోబర్‌ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్‌ 3న జన్మించిన జస్టిస్‌ బాగ్చీ.. 2011 జూన్‌27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు.  13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్‌ బాగ్చీ పేరును సిఫారసు చేసింది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు