కారణాలు చెప్పకపోవడం సరికాదు

Published on Sun, 08/02/2026 - 05:23

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ఎలాంటి కారణాలు చెప్పకపోవడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా సమూహాన్ని చీమల్లా వరి్ణంచే న్యాయమూర్తులు వ్యవస్థలోకి వచ్చే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు. ‘‘కొలీజియం ఇటీవల మూడు తీర్మానాల్లో జడ్జీల నియామకానికి ఏ రకమైన కారణాలూ చెప్పలేదు. ఇది పారదర్శకత సిద్ధాంతం నుంచి వెనకడుగు వేసినట్లే’’అని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ తీర్మానాలు కాపీ పేస్ట్‌ చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. 

విధి అనే సంస్థ చేపట్టిన జల్దీ కార్యక్రమం తాలూకూ నివేదిక విడుదల సందర్భంగా శనివారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ కొలీజియం తన నిర్ణయాలకు కారణాలు చెప్పకపోవడం వల్ల ప్రతిభావంతులైన జడ్జీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా.. కొంతమంది వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించి ఆ తరువాత ప్రజలను చీమలని రాజ్యాంగ విరుద్ధంగా, విలువలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. 

2024లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి వీహెచ్‌పీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ‘‘చిన్న చీమకు కూడా హాని చేయకూడదన్న విలువలు మనకు నేరి్పంచారు. అందుకే మనం సహానుభూతి, ఓర్పుతో ఉంటున్నాం. ఇతరులు బాధపడుతూంటే మనకూ నొప్పిగా అనిపిస్తూంటుంది. అయితే మీ సంస్కృతిలో పిల్లలు చిన్నప్పటి నుంచి జంతువులను నరకడం చూస్తూంటారు. అలాంటివాళ్లు ఓరిమితో, సహానుభూతితో ఉంటారని ఎలా ఆశించగలం’’అని ఆ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

‘ద్వేషపూరిత ప్రసంగం’చేసినందుకు ఆ జడ్జిపై చర్యకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి కూడా. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా కొంతమంది యువకులు ‘కాక్రోచ్‌’లుగా మారారని వ్యాఖ్యానించడం ఆది కాస్తా కాక్రోచ్‌ జనతా పార్టీ ఆవిర్భావానికి, ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే కొలీజియంపై వస్తున్న విమర్శలపై సీజేఐ గతంలో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫారసులు వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటాయని, పనితీరు, న్యాయమూర్తులుగా కొనసాగిన కాలం, నిర్వహించిన హోదాల వంటివి పరిగణనలోకి తీసుకుంటామని సీజేఐ స్పష్టం చేశారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)