Breaking News

ఇబ్బంది పెట్టే సంబరాలు ఎందుకు: జస్టిస్‌ ఓకా

Published on Thu, 10/30/2025 - 09:51

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పండుగలు జరుపుకునే తీరుపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఒకా(Justice Abhay S. Oka) అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయు, శబ్ధ, జల కాలుష్యాలకు కారణమవుతున్న పండగ సంబరాల విషయంలో న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఇటీవల ‘‘కాలుష్యం.. వాతావరణ మార్పులు.. మనం.. సుస్థిర భవిష్యత్తు’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పండుగల పేరుతో పర్యావరణ నాశనాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

మత సంప్రదాయాల పేరుతో విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు నదులను కలుషితం చేస్తున్న వైనం, వీధుల్లో హద్దులు, నిబంధనలు మీరి జరుపుకున్న దీపావళి వేడుకల కారణంగా పలు చోట్ల పౌరులకు అసౌకర్యం, కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవించడం వంటి ఘటనల జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా మాటలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడుతోంది. అంతేకాదు.. దీపావళి, గణేశ్‌ ఉత్సవాలు, న్యూఇయర్‌ వేడకల్లో తొక్కిసలాటలు, ప్రమాదాల కారణంగా పలువురు గాయపడుతూండటం, కొందరు ప్రాణాలు కోల్పోతూండటం కూడా జస్టిస్‌ ఓకా వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 

‘‘టపాసులు కాల్చడం, లౌడ్‌ స్పీకర్లతో ఊరేగింపులు.. నదుల్లో విగ్రహాల నిమజ్జనం వంటివి ఏవీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద వచ్చే అత్యంత ప్రధానమైన మత సంప్రదాయల కిందకు రావు’’ అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన వైఫల్యానికి కీలకమైన కారణం ఏమిటంటే.. అటు పౌరులు, ఇటు ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని 51ఏ నిబంధనల్లోని ప్రాథమిక బాధ్యతలను విస్మరించడం అని ఆయన అన్నారు.‘‘దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. మతం పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే ధోరణి ఉండటం. అయితే ప్రపంచంలోని ప్రతి మతం కూడా ప్రకృతిని కాపాడమనే చెబుతోంది. సాటి జీవజాతులతో సహానుభూతితో వ్యవహరించమనే చెబుతుంది. పండుగలను జరుపుకునే క్రమంలో పర్యావరణాన్ని నాశనం చేయమని, జంతువుల పట్ల క్రూరత్వంతో వ్యవహరించమని ఏ మతమూ చెప్పదు’’ అని స్పష్టం చేశారు. దీపావళి వస్తే టపాసుల శబ్ధాలతో ఊళ్లకు ఊళ్లు మారుమోగిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ శబ్ధాలకు పక్షలు, జంతువులు బెదిరిపోతూంటాయి. చిన్న పిల్లలు, వయోవృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతూంటారు. వీరందరిని ఇబ్బంది పెట్టడంలో వచ్చే సంతోషం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

న్యాయ వ్యవస్థ ఆదర్శంగా నిలవాలి..
ప్రకృతిని కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అన్నది గుర్తించాలని ఆయన కోరారు. పౌరులు, రాజ్యం కూడా మత సెంటిమెంట్ల ప్రభావానికి లోనుకాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. మతపెద్దలు, రాజకీయ నేతలు కూడా పండుగల సమయంలో కలిగే కాలుష్యం, అసౌకర్యాల విషయంలో నోరెత్తకపోవడంపై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌. ఓకా అందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సంబంధిత న్యాయం కోసం పోరాడుతున్న వారికి సమాజం నుంచి మద్దతు కూడా కరవు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)