Breaking News

మా దగ్గర మంత్రదండం ఉందా? 

Published on Fri, 11/28/2025 - 06:17

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏదైనా మంత్ర దండం ఉందా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థలకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని గురువారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చిల ధర్మాసనం ఎదుట అమికస్‌ క్యూరీగా ఉన్న అపరాజిత ప్రస్తావించారు.

 ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో కాలుష్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని నివేదించారు. ఇది హెల్త్‌ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి అని పేర్కొన్నారు. స్పందించిన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌..‘ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్రమాదకర పరిస్థితులున్న విషయం మాకూ తెలుసు. సమస్య పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఏదైనా మంత్రదండం ప్రయోగిస్తుందని అనుకోవద్దు. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడానికి ఎలాంటి మార్గనిర్దేశాలు చేయగలమో చెప్పండి? వాయు కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణకు గతంలో ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశారు. 

కానీ, నిర్ణయాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. కఠినమైన రోజువారీ పర్యవేక్షణతోనే ఈ పరిస్థితి మెరుగుపడుతుంది’అని వ్యాఖ్యానించారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆంక్షలు అమలు చేయాలన్న వాదనను తోసిపుచ్చింది. దీర్ఘకాల పరిష్కారం అవసరమంది.‘ప్రభుత్వం వేసిన కమిటీలు చేసిన సిఫార్సులు ఏమిటి? తక్షణ చర్యలు చూపే చర్యలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫైళ్లలో మగ్గుతున్న ఆదేశాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాం’అని ధర్మాసనం అభిప్రాయపడింది.  

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)