Breaking News

శాంతంగా ఉండండి

Published on Tue, 07/08/2025 - 06:02

ముంబై: న్యాయస్థానాల్లో వాడీవేడీగా వాదనలు జరుగుతుంటే సంయమనంతో ఉండాల్సిన న్యాయమూర్తులు సైతం పట్టరాని ఆవేశంతో లాయర్లపై విరుచుకుపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆవేశాలు కోర్టుల్లో ప్రశాంత పనివాతావరణాన్ని పాడుచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో బాంబే హైకోర్టులో కేసుల వాదోపవాదనల ప్రత్యక్ష ప్రసారాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని సీజేఐ గవాయ్‌ ప్రారంభించి తర్వాత ప్రసంగించారు. 

‘‘బాంబే హైకోర్టులో న్యాయమూర్తులు వెలువర్చిన ఎన్నో తీర్పులను చూసి గర్వపడ్డా. తీర్పులను చాలా చక్కగా రాశారు. అయితే ఈ హైకోర్టు జడ్జీలపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయమూర్తులు కోపాన్ని నియంత్రించుకోలేక కోర్టుల్లోనే తిట్టేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. న్యాయమూర్తిగా పనిచేయడం అనేది మిగతా ఉద్యోగాల మాదిరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పనిచేసేది కాదు. సమాజం, దేశం కోసం చేసే అత్యుత్తమమైన సేవల్లో ఇదీ ఒకటి. 

ఇందుకు అంకితభావం, నిబద్ధత చాలా అవసరం. అయితే కొందరు జడ్జీలు తరచూ లాయర్లతో మర్యాదలేకుండా, పరుష పదజాలం ఉపయోగిస్తూ తిడుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ లాయర్లకు, కొందరు ఉన్నతాధికారులకు సమన్లు జారీచేస్తున్నారు. అనవసరంగా సమన్లు జారీచేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. జడ్జీలు ప్రశాంతంగా ఉంటే కోర్టుహాల్‌లో వాతావరణం హుందాగా ఉంటుంది. అలాంటప్పుడే లాయర్లుసహా అక్కడ ఉండేవాళ్లందరి రక్తపోటు, చక్కర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఇది న్యాయమూర్తులకూ వర్తిస్తుంది’’అని అనగానే అక్కడ ఉన్నవా
రంతా ఫక్కున నవ్వారు.  

పార్ట్‌టైమ్‌ జడ్జీల్లా తయారయ్యారు 
‘‘కొందరు జడ్జీలు రోజువారీ విధులను సంపూర్ణంగా చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి పార్ట్‌టైమ్‌ జడ్జీలతో సమస్యే. కొన్ని ధర్మాసనాల్లో కొందరు జడ్జీల వైఖరిపై నాకు పక్కా సమాచారం అందింది. పేర్లు వెల్లడించనుగానీ వాళ్లు కోర్టు మొదటి సెషన్‌లో కొద్దిసేపు, తర్వాతి సెషన్‌లో కొద్దిసేపు అలా ధర్మాసనంపై కూర్చుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి పార్ట్‌టైమ్‌ జడ్జీల వైఖరి మంచిది కాదు. సమాజానికి, దేశానికి సేవచేస్తామని జడ్జీగా ప్రమాణంచేశాక ఇలాంటి ధోరణి ప్రదర్శించడం ఆ ప్రమాణాన్ని చిన్నచూపు చూడటమే అవుతుంది. ఇలాంటి చర్యలతో న్యాయస్థానాలకు చెడ్డపేరు తీసుకురావొద్దు. ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, లాయర్లు అంకితభావం, కృషితో సమున్నత స్థాయికి చేరిన న్యాయస్థానాల ఘనకీర్తికి మచ్చ తీసుకురాకండి’’అని హితవు పలికారు.

కాలానుగుణంగా చట్టాలను అన్వయించుకోవాలి 
విస్తృతస్థాయిలో రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్‌కు ఉందంటూ ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై సీజేఐ మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో సమూలస్థాయిలో మార్పులు చేయాలన్న వాదనలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి రాజ్యాంగం అనేది సజీవ పత్రం. మారుతున్న కాలానుగుణంగా, సమాజ అవసరాలకు తగ్గట్లుగా పార్లమెంట్‌ రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు. సామాజిక, ఆర్థికాభివృద్దికి బాటలువేసేలా ఆ మార్పులు ఉండాలి.

 చట్టాలు, రాజ్యాంగాన్ని నేటి సమాజ సవాళ్లకు పరిష్కారాలు వెతికేందుకు అనువుగా మాత్రమే అన్వయించుకోవాలి. సమాజ అవసరాలు తీర్చేలా న్యాయవితరణలో న్యాయస్థానాలు చట్టాలు, రాజ్యాంగాన్ని ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి’’అని సీజేఐ అన్నారు. ‘‘జడ్జీ పోస్ట్‌లోకి సిఫార్సుచేసేముందుగా ఆయా అభ్యర్థులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే కొత్త సంస్కృతికి సుప్రీంకోర్టు తెరలేపింది. అయితే ఒక హైకోర్టులో అభ్యర్థులే ముందుగా చొరవతీసుకుని జడ్జీలను కలిసే ప్రయత్నంచేసినట్లు నాకు తెలిసింది. ఇలాంటి అనుచిత ధోరణి బాంబే హైకోర్టులో ఉండబోదనే ఆశిస్తున్నా’’అని ఆయన అన్నారు.  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)