Breaking News

కబరస్తాన్‌ గేటు దూకి.. అమరులకు నివాళులర్పించి..! 

Published on Tue, 07/15/2025 - 06:42

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని నక్ష్ బంద్‌ సాహిబ్‌ కబరస్తాన్‌ వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1931 జూలై 13న డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన 22 మంది సమాధులు ఇందులోనే ఉన్నాయి. ముఖ్యనేతలెవరూ ఇక్కడికి నివాళులరి్పంచడానికి రాకూడదని యంత్రాంగం సీఎం ఒమర్‌ సహా పలువురు నేతలను ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే, సోమవారం సీఎం ఒమర్‌ సహా పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు. 

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఆటోలో, విద్యామంత్రి సకినా ఇట్టూ స్కూటీపై వచ్చారు. కబరస్తాన్‌కు దారి తీసే రెండు వైపులా దారుల్నీ అధికారులు మూసివేశారు. ఖన్‌య్రాŠ ప్రాంతానికి చేరుకున్న సీఎం ఒమర్‌ తన వాహనం దిగి అరకిలో మీటర్‌ దూరంలో ఉన్న కబరస్తాన్‌కు కాలి­నడకన చేరుకున్నారు. కబరస్తాన్‌కు తాళంవేసి ఉంచడంతో ఇనుప గేటు పైకెక్కి లోపలికి చేరుకున్నారు. కొందరు నేతలు కూడా ఆయన్ను అనుసరించారు. కొద్దిసేపటికి అధికారులు గేట్లు తెరిచారు. 

దీంతో, ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు కూడా వచ్చి అమరుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఒమర్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్‌ మనోజ్‌ సిన్హా చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు సోమవారం తనను ఎందుకు ఆపారంటూ మండిపడ్డారు. వాళ్లు మమ్మల్ని బానిసలని అనుకుంటున్నారు. కానీ, మేం ప్రజలు మాత్రమే సేవకులం. యూనిఫాంలో ఉన్న పోలీసులు చట్టం మర్చిపోతున్నారు. పరుగెత్తుతున్న మమ్మల్ని వెంటాడారు. మా చేతిలోని జెండాను చింపేయాలని చూశారు’అని ఆరోపించారు.  

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)