Breaking News

Sita Soren: జేఎమ్‌ఎమ్‌కు రాజీనామా.. గంటల్లోనే బీజేపీలో చేరిక

Published on Tue, 03/19/2024 - 19:01

జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీత సోరెన్‌ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది. 

కాగా జేఎమ్‌ఎమ్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వ‌దిన‌ అవుతుంది. అనారోగ్యంతో దుర్గా సోరెన్ 2009లో మరణించారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయితే భర్త మరణానంతరం తనను, తన కుటుంబాన్ని సోరెన్‌ కుటుంబ సభ్యులు పక్కన పెట్టారని ఆరోపిస్తూ మంగళవారం జేమ్‌ఎమ్‌ పార్టీకి సీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అన్ని పదవులకు, జార్ఖండ్ అసెంబ్లీలోని జామా స్థానానికి కూడా ఆమె రాజీనామా చేశారు.

‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని ఆరోపించారు. తనకు, తన కుతూళ్లకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోందని విమర్శించారు. అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ స‌భ్యులు, కుటుంబం త‌మ‌ను వేరు చేసే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)