Breaking News

JEE Main Result 2025: టాప్ ర్యాంక‌ర్లు వీరే

Published on Sat, 04/19/2025 - 13:36

జాయింట్ ఎంట‌న్స్‌ ఎగ్జామినేష‌న్ (జేఈఈ) మెయిన్ 2025 ఫలితాలు శుక్ర‌వారం అర్థ‌రాత్రి విడుద‌ల‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా ఈసారి రెండు విడ‌త‌ల్లో క‌లిపి 24 మంది విద్యార్థులు 100 ప‌ర్సంటైల్ సాధించి స‌త్తా చాటారు. వీరిలో న‌లుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉండ‌డం విశేషం. రాజ‌స్థాన్ నుంచి అత్య‌ధికంగా ఏడుగురు 100 ప‌ర్సంటైల్ సాధించారు. తెలంగాణ (3), మ‌హారాష్ట్ర‌ (3), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(3) ఇద్ద‌రు ప‌శ్చిమ బెంగాల్‌, గుజ‌రాత్ (2), ఢిల్లీ(2), ఏపీ (1), క‌ర్ణాట‌క (1) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్ల‌డించింది.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన‌ ఎండీ అనాస్, ఆయుష్ సింఘాల్ (Ayush Singhal) మొద‌టి రెండు ర్యాంకులు కైవ‌సం చేసుకున్నారు. 100 ప‌ర్సంటైల్ సాధించిన వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే బాలిక‌లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ (Sai Manogna Guthikonda) మాత్రమే టాప‌ర్ల‌లో చోటు సంపాదించారు. మెయిన్ ఫలితంతో పాటు, అడ్వాన్స్‌డ్ 2025 కటాఫ్ మార్కులు, ఆలిండియా ర్యాంక్ లిస్ట్‌, రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ విడుద‌ల చేసింది. వివిధ కార‌ణాల‌తో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది.

100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు
1. ఎండీ అనాస్ - రాజస్థాన్
2. ఆయుష్ సింఘాల్ - రాజస్థాన్
3. ఆర్కిస్మాన్ నంది - పశ్చిమ బెంగాల్
4. దేవదత్త మాఝీ - పశ్చిమ బెంగాల్
5. ఆయుష్ రవి చౌదరి - మహారాష్ట్ర
6. లక్ష్య శర్మ - రాజస్థాన్
7. కుశాగ్ర గుప్త - కర్ణాటక
8. హర్ష్ ఎ గుప్తా - తెలంగాణ
9. ఆదిత్ ప్రకాష్ భగడే - గుజరాత్

10. దక్ష్ - ఢిల్లీ
11. హర్ష్ ఝా - ఢిల్లీ
12. రజిత్ గుప్తా - రాజస్థాన్
13. శ్రేయాస్ లోహియా - ఉత్తరప్రదేశ్
14. సాక్షం జిందాల్ - రాజస్థాన్
15. సౌరవ్ - ఉత్తరప్రదేశ్
16. వంగాల అజయ్ రెడ్డి - తెలంగాణ
17. సానిధ్య సరాఫ్ - మహారాష్ట్ర
18. విశాద్ జైన్ - మహారాష్ట్ర
19. అర్నవ్ సింగ్ - రాజస్థాన్
20. శివన్ వికాస్ తోష్నివాల్ - గుజరాత్

21. కుశాగ్రా బైంగహా - ఉత్తరప్రదేశ్
22. సాయి మనోజ్ఞ గుత్తికొండ - ఆంధ్రప్రదేశ్
23. ఓం ప్రకాష్ బెహెరా - రాజస్థాన్
24. బని బ్రతా మాజీ - తెలంగాణ

అడ్వాన్స్‌డ్‌కు 2.50 లక్షల మంది
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా, 9,92,350 మంది పరీక్షకు హాజ‌ర‌య్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షరాశారు. జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాల ఆధారంగా 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్‌ 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.

జేఈఈ మెయిన్ రెండో సెషన్‌
ద‌ర‌ఖాస్తులు: 10,61,849 
ప‌రీక్ష‌ రాసిన వారు: 9,92,350 
జనరల్: 372,675
ఓబీసీ: 374,860
ఈడ‌బ్ల్యూఎస్‌: 112,790
ఎస్సీ: 97,887
ఎస్టీ: 34,138

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)