Breaking News

22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ

Published on Thu, 01/18/2024 - 13:40

ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ‍ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్‌లోని సౌసర్‌ నగర్‌లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  

అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు  శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు.
ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)