Breaking News

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Published on Mon, 08/26/2024 - 06:58

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో గోపాల కృష్ణుని జన్మదిన వేడుకల కోసం ప్రముఖ బిర్లా ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా  మొదలయ్యాయి.

మధురలోని శ్రీ కృష్ణుని ఆలయం నేడు (సోమవారం) 20 గంటల పాటు తెరిచి ఉంటుందని, భక్తులకు నిరంతరాయంగా దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు మంగళ హారతి, పంచామృత అభిషేకం, పుష్ప సమర్పణలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ పండితుడు నృత్య గోపాల్ దాస్ నేతృత్వంలోని నేటి అర్ధరాత్రి మహా అభిషేక వేడుక రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 12.40 వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున రెండు గంటలకు శయన హారతి నిర్వహించనున్నారు.
 

ఢిల్లీలోని బిర్లా ఆలయంలో పూల మాలలు, నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విద్యుత్  కాంతులు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. జన్మాష్టమి వేళ బిర్లా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ జరిగే భజన కీర్తనలు, శ్రీకృష్ణ లీలలను భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు.

నోయిడాలోని ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయం వద్ద ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జన్మాష్టమి నాడు ఇస్కాన్ ఆలయానికి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని  ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)