Breaking News

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం 

Published on Wed, 10/04/2023 - 18:43

శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఒకపక్క రాజౌరీ జిల్లాలో 48 గంటలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుండగానే కుల్గామ్‌లోని కుజ్జర్ ప్రాంతంలో ఉగ్రవాదుల అలజడిపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగారు. 

కార్డాన్ సెర్చ్‌లో భాగంగా కుల్గామ్‌లో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉన్నట్టుండి మాపై కాల్పులు జరపగా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపామని ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపాయి కశ్మీర్ పోలీస్ వర్గాలు. 

ఇదిలా ఉండగా రాజౌరీ జిల్లాలోని కలకోట్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే మూడోరోజుకు చేరుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పారా కమాండోలతో పాటు మరో ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న న్యూస్‌క్లిక్ అధినేత

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)