Breaking News

లేడీ డాక్టర్‌ హత్య.. బజరంగ్ దళ్ నిరసనలు

Published on Sat, 03/11/2023 - 14:01

జమ్ముకశ్మీర్‌లో ఓ లేడీ డాక్టర్‌ హత్య  కేసు మతపరమైన మలుపు తీసుకుంటోంది. ఇందులో లవ్‌ జిహాదీ కోణం ఉందని, డాక్టర్‌ సుమేధాను ప్రియుడే హత్య చేశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బజరంగ్‌ దళ్‌ రోడ్డెక్కింది. 

సుమేధా శర్మ.. జమ్ము పాంపోష్‌ కాలనీలో జనవరి 7వ తేదీన దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ జోహార్ గనై గాయాలతో పడి ఉన్నాడు. దీంతో పోలీసులు అతన్ని జీఎంసీ జమ్ముకి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. 

దారుణానికి కొన్నిగంటల ముందు గనై తనకు జీవితం మీద విరక్తి కలుగుతోందని.. తనకు బతకాలని లేదంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. అది చూసి అతని బంధువు ఒకరు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులకు సుమేధా విగత జీవిగా, పక్కనే గనై గాయాలతో కనిపించారు.

అయితే ఈ వ్యవహారంలో లవ్‌ జిహాద్‌ కోణం ఉన్నట్లు బజరంగ్‌ దళ్‌ అనుమానిస్తోంది. పక్కా ప్రణాళికతోనే సుమేధాను గనై హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. జమ్ము కశ్మీర్‌లో మైనారిటీలకు రక్షణ కరువైందని.. లవ్‌ జిహాద్‌ వ్యవహారాల కట్టడికి చట్టాలు అవసరమంటూ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీస్‌ శాఖ సిట్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు