Breaking News

జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

Published on Mon, 07/08/2024 - 20:18

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. 

మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్‌ రోడ్‌లో పాట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్‌ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. 

ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు  స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది.  ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. 

ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో(మోడర్గాం, ఫ్రిసాల్‌ ఏరియా)  ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)