Breaking News

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..

Published on Thu, 11/16/2023 - 07:07

జమ్మూ కశ్మీర్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్‌ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్‌లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 

జమ్ముకాశ్మీర్‌లో భారీ రోడ్డు ప్రమాదాలు
2019, జూలై 1: కిష్త్వార్‌లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు.

2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్‌లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు. 

2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం.

2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి.

2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.

2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం.

2019, మార్చి 15: రాంబన్‌లో కారు  లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు.

2023, మే 24: కిష్త్వార్‌లోని దచాన్ ప్రాంతంలోని దంగ్‌దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు.

2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు.

2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ‍ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)