Breaking News

లోక్‌సభకు ‘జమిలి’ బిల్లు? బీజేపీ ఎంపీలకు విప్‌!

Published on Mon, 12/16/2024 - 19:06

సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్‌17) లోక్‌సభలో వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్‌ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్‌  నుంచి తొలగించారు.

ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్‌ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్‌ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్‌ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.  జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్‌ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్‌ ఇండియా సమస్యే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)