Breaking News

ఐదేళ్ల తర్వాత చైనాకు జైశంకర్‌.. ఎందుకెళుతున్నారంటే..

Published on Sat, 07/12/2025 - 10:07

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత చైనాలో జైశంకర్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వెంబడి 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తర్వాత  ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ పర్యటనలో జైశంకర్ షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి ముందు ఆయన బీజింగ్‌లో చైనా ప్రతినిధి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. కాగా సరిహద్దు వివాదంపై భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారని వార్తా సంస్థ పీటీఐ గతంలో తెలిపింది. ఇరు దేశాలు  తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

భారత్‌- చైనా సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని జైశంకర్ ఇటీవల అన్నారు. ఈ పర్యటనలో జైశంకర్.. సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వం, భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం  తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని  సమాచారం. 2020 మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. దాదాపు ఐదేళ విరామం తర్వాత గత నెలలో ఇరు దేశాలు కైలాస మానసరోవర యాత్రను తిరిగి ప్రారంభించాయి.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)