Breaking News

ఇందిరాగాంధీ నా తం‍డ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్‌

Published on Tue, 02/21/2023 - 17:50

విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఒక మీడియా ఇంటర్వ్యూలో విదేశాంగ అధికారి నుంచి క్యాబినేట్‌ మంత్రి వరకు సాగిన తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. తాను ప్రభుత్వాధికారుల కుటుంబానికి చెందినవాడినని అన్నారు. తనకు 2019లో కేంద్రమంత్రిగా రాజకీయ అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ.. తన తండ్రి డాక్టర్‌ కె సుబ్రమణియన్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీగా పనిచేశారని, 1980లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని తొలగించారని చెప్పారు.

ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ సమయంలో తన తండ్రి కంటే జూనియర్‌ క్యాబినేట్‌ సెక్రటరీ అ‍య్యారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాధికారిగా ఉన్న తన తండ్రి సుబ్రమణ్యం 1979 జనతా ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన డిఫెన్స్‌ ప్రొడెక్షన్‌ సెక్రటరీ. అయితే ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగింపబడ్డ తొలి వ్యక్తి నా తండ్రే.  అందువల్లే తన అన్నయ్య సెక్రటరీ అవ్వడంతో తన తండ్రి ఎంతగానో సంతోషించాడున్నారు. 

బహుశా అందువల్లే కాబోలు తాను కూడా మంచి అధికారిగానే కాకుండా విదేశాంగ కార్యదర్శి పదవికి ఎదగాలని కోరుకున్నా. కానీ తాను తన తండ్రి మరణించాకే విదేశాంగ కార్యదర్శిని అయ్యానన్నారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినేట్‌లో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రధాని చేసిన ఫోన్‌కాల్‌ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ తర్వాత తాను కేంద్ర మంత్రి వర్గంలో చేరినట్లు చెప్పారు.  అయితే విదేశాంగ కార్యదర్శిగా జీవితాంతం ఎందరో రాజకీయ నాయకులను చూశానన్నారు.కానీ తాను పార్లమెంట్‌ సభ్యుడిని కాకపోవడంతో రాజకీయాల్లోకి చేరడం, రాజసభ సభ్యుడు కావడం, అన్ని ఒక్కొక్కటిగా తనకు తెలియకుండానే సాగిపోయాయని చెప్పుకొచ్చారు.  

ఒక ప్రభుత్వాధికారితో పోలిస్తే కేంద్ర మంత్రి ఎక్స్‌పోజర్‌ వేరే స్థాయిలో ఉంటుందన్నారు జైశంకర్‌. ఫారెన్‌ సర్వీస్‌ అధికారిగా, మంత్రిగా విభిన్న ప్రపంచ ఉండటమే గాక ఒక సవాలుగా కూడా ఉంటుందన్నారు. ఐతే బ్యూరోక్రాట్‌ కంటే మంత్రి వేగంగా ఆలోచించగలడని అన్నారు. ‍ప్రతి సమస్య వెనుకు ఒక రాజకీయ కోణం దాగి ఉంటుందని, అది ఒక చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు మంత్రి జై శంకర్‌. కాగా, 2015 నుంచి 2018 వరకు జై శంకర్‌ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.

(చదవండి: ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌: ఇద్దరికీ ఝలక్‌ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?