Breaking News

రష్యా వెళ్లిన జై శంకర్‌

Published on Wed, 08/20/2025 - 08:12

న్యూఢిల్లీ: రష్యాలో మూడు రోజుల పర్యటనకు గాను మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మంగళవారం మాస్కోకు బయలుదేరారు. రష్యాతో కొనసాగుతున్న చిరకాల మైత్రిని మరింత దృఢతరం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు కొంటుందనే సాకుతో భారత్‌ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్న నేపథ్యంలో జై శంకర్‌ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

బుధవారం జరిగే వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకార రష్యా–చైనా ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమిషన్‌ 26వ సెషన్‌కు ఆయన సహాధ్యక్షత వహిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో రష్యా ఫస్ట్‌ డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్‌ మంతురోవ్‌ సహాధ్యక్షత వహిస్తారంది. 

వీరిద్దరూ ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేపట్టే భారత పర్యటనకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారని చెప్పారు. జై శంకర్‌ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తోనూ భేటీ అవుతారు. రష్యా– ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందం, అందుకు సంబంధించి ఇటీవల ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరుపుతారు. ఇతర ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ చర్చిస్తారు. ఇంధన రంగంలో రెండు దేశాల సంబంధాలు కూడా ప్రస్తావనకు వస్తాయని విదేశాంగ శాఖ తెలిపింది. 

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)