Breaking News

కలిసి పనిచేస్తేనే లాభం! 

Published on Mon, 06/23/2025 - 04:31

న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో సంబంధాలు ఎల్లప్పుడూ సజావుగా సాగాలని ఆశించకూడదని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. పాలకులతో సంబంధం లేకుండా సంబంధాల్లో స్థిరత్వాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం ప్రయతి్నంచిందని నొక్కి చెప్పారు. అందుకు శ్రీలంక, మాల్దీవులను ఆయన ఉదహరించారు. అక్కడ నాయకత్వం మారినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఏ దేశంతోనైనా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు చేతులెత్తేయకూడదన్నారు. 

భారత్‌తో కలిసి పనిచేయడం ఇతర దేశాలకే లాభిస్తుందని, లేదంటే వారే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని గ్రహించడానికి కొన్ని దేశాలకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సైన్యం చేతుల్లో అధికారం, భారత్‌పై శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్‌ ఇందుకు మినహాయింపని, ఒక్క పాక్‌ను పక్కనపెడితే.. దౌత్యం అన్ని చోట్లా వర్తిస్తుందన్నారు. డీడీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్‌ను తన ఎక్స్‌ హ్యాండిల్‌లో శనివారం రాత్రి ఆయన పోస్టు చేశారు. 

దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో దౌత్యసంబంధాలపై అనేక విషయాలను జైశంకర్‌ పంచుకున్నారు. చైనాతో చాలా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి మన సామర్థ్యాలను పెంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జూన్‌ 2020లో గాల్వన్‌ లోయ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే.. గత దశాబ్దాల్లో మన సరిహద్దు మౌలిక సదుపాయాలను పూర్తిగా విస్మరించడం వల్లే ఈ గందరగోళ పరిస్థితి వచ్చింన్నారు. 

కానీ బీజేపీ ప్రభుత్వం సరిహద్దు మౌలిక సదుపాయాలపై నిర్మించడం వల్ల పరిస్థితి మారిపోయిందని, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతున్నామని జైశంకర్‌ తెలిపారు. గత 11 ఏళ్లలో భారత్‌ పొరుగు దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకుందని, గల్ఫ్‌ దేశాలకు చేరువైందని, ఆసియాన్, ఇండో–పసిఫిక్‌ ప్రాంతాలతో సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకుందని చెప్పారు. 

మోదీ ప్రభుత్వం హయాంలో పాకిస్తాన్‌ పట్ల భారతదేశ విధానం మారిపోయిందని, 2016 ఉరి సర్జికల్‌ స్ట్రైక్, 2019 బాలకోట్‌ వైమానిక దాడులను ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దు, భారత్‌ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను విస్తృత వ్యూహంలో భాగాలుగా చూడాలని జైశంకర్‌ చెప్పారు. ప్రధాని మోదీని ‘మన కాలపు నాయకుడు’గా జైశంకర్‌ అభివరి్ణంచారు. ప్రజల మానసిక స్థితి మారిందని, ప్రజల ఆత్మవిశ్వాసానికి’ప్రధాని మోదీ నిదర్శనమని మంత్రి నొక్కి చెప్పారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)