Breaking News

ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా

Published on Mon, 07/21/2025 - 21:38

సాక్షి,న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం మరో రెండేళ్ల ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సోమవారం (జులై 21) ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

ఇటీవల  తలెత్తిన అనారోగ్యం కారణంగా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పదవీకాలంలో రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంట్ సభ్యుల నుంచి పొందిన మద్దతుకు ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం సాధించిన ఆర్థిక పురోగతి, అభివృద్ధి,ప్రపంచ స్థాయిలో ఎదుగుదలను చూశానని అన్నారు.

కాగా, 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్లమెంటరీ వ్యవహారాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ప్రశంసలు పొందారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా (2019–2022) పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. 

ఈ ఏడాది మార్చిలో గుండె సంబంధిత సమస్యల కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. తాజాగా, ఆనారోగ్య సమస్యల కారణంగా  రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఏ) కింద తన పదవికి  రాజీనామా చేశారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)