Breaking News

అపచారం

Published on Mon, 07/21/2025 - 12:15

భువనేశ్వర్‌: శ్రీ మందిరం ప్రాకారంలో భాగంగా జగతినాథుని వివిధ అలంకారాల శోభిత ప్రతిమల్ని సమగ్ర ఎయిర్‌ కండిషన్‌ జగన్నాథ్‌ వల్లభ్‌ సముదాయంలో అత్యంత అట్టహాసంగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఏర్పాటు చేసింది.

ఏడాది పొడవునా పలు పండగలు, ఉత్సవాలు, యాత్రలు సందర్భంగా స్వామి వివిధ రూపాల అలంకరణతో ఈ నమూనా మూర్తుల్ని ఎయిర్‌ కండిషన్‌ సముదాయంలో సందర్శకుల కోసం ప్రదర్శించారు. ఒకే చోట ఆరాధ్య దైవం వివిధ అపురూప అలంకరణ శోభతో తిలకించే భాగ్యం పట్ల అశేష భక్త, యాత్రికుల జనం సంతోషం వ్యక్తం చేసింది.   పాలకులు మారడంతో తీరు మారింది. పవిత్రమైన జగతి నాథునితో అన్నా చెల్లెలు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర ప్రతిమలు మరుగున పడ్డాయి. జగన్నాథ్‌ వల్లభ్‌ సముదాయం సెల్లార్‌ వాహన పార్కింగులో మూటలు గట్టి ఈ పవిత్ర ప్రతిమల్ని మరుగున పడేశారు.

ఈ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. స్వామి 25 రకాల అలంకరణతో యాత్రికులకు అలరించిన నమూనా ప్రతిమలు నేడు ఇలా మరుగున పడడం అత్యంత విచారకరం. వీటిలో అత్యంత అరుదైన రఘునాథ అలంకరణ నమూనా కూడ మూటలో ముడి పడి పోయింది. ప్రత్యక్షంగా స్వామి అలంకరణని తిలకించే భాగ్యం లేని అపురూప రూపాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, శ్రీ మందిరం యాజమాన్య యంత్రాంగం నిర్లక్ష్యపు చర్యలతో ఇలా అపవిత్రత మధ్య మగ్గిపోతున్నాయి.

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)