Breaking News

Uttar Pradesh: నక్కను తోడేలు అనుకొని..

Published on Mon, 09/09/2024 - 11:06

సీతాపూర్:  ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం తోడేళ్ల వేటలో పడింది. తాజాగా రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఓ యువకుడు నక్కను తోడేలుగా భావించి చంపేశాడు.  ఈ ఘటన సిధౌలీ తహసీల్‌లోని అసోధన్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ యువకుడిపై నక్క దాడి చేసింది. ఆ యువకుడు దానితో పెనుగులాడాడు. ఈ దాడిలో ఆయువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ నక్కను తోడేలుగా భావించిన యువకుడు దానిని కాళ్లతో తన్నిచంపేశాడు.

యువకుని కేకలు విన్న గ్రామస్తులు కర్రలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  వారు టార్చ్ లైట్‌ వెలుగులో దానిని చూసి, అది తోడేలు కాదని, నక్క అని గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడిని ఇంటికి పంపించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)