Breaking News

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌

Published on Tue, 07/22/2025 - 16:51

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. 2018-2019 సంవత్సరానికి గానూ రూ.199.5 కోట్ల ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యూనల్‌ కాంగ్రెస్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలోని సెక్షన్‌ 13ఏను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు అందుకు గల కారణాల్ని  ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యూనల్‌ ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను 2019 ఫిబ్రవరి 2న ఫైలింగ్ చేసింది. ఇది 2018 డిసెంబర్ 31 చివరి తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్‌ కింద రాకపోవడం వల్ల, సెక్షన్ 13A ప్రకారం మినహాయింపు పొందలేకపోయింది.

దీనికి తోడు పార్టీ ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ నియమాలకు విరుద్ధంగా నగదు విరాళాలు సేకరించింది. పార్టీ సేకరించిన రూ.14.49 లక్షల నగదులో విరాళాలు అందించిన దాత రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో సమర్పించారు. తద్వారా సెక్షన్ 13A(డీ) నిబంధనలను ఉల్లంఘించింది.

రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలి. చారిటబుల్ ట్రస్టులుకి ఉన్న వెసులుబాటు రాజకీయ పార్టీలకు వర్తించదు. దీంతో తాజా ట్యాక్స్‌ ట్రిబ్యూనల్‌ నిర్ణయం కాంగ్రెస్‌కు ఎదుదెబ్బ తగిలినట్లైంది. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)