Breaking News

తుపాను సమయంలో ఫోన్‌ వాడకూడదా? దీనిలో నిజమెంత?

Published on Wed, 10/04/2023 - 12:41

పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు.  ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని,  మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్‌ శక్తిని ఫోన్‌ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్‌ ఫోన్‌టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్‌  ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్‌ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్‌ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్‌ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం?

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)